ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు..

ఓ మాతృమూర్తి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్వర్ణ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణచాంద మండలం చామన్ పల్లి గ్రామానికి చెందిన మంజుల అనే గర్భిణీ స్వర్ణ ఆసుపత్రిలో వైద్యం పొందుతోంది. ఆమెకు నెలలు పూర్తి కావడంతో ప్రసవం పోసుకునేందుకు బుధవారం ఆసుపత్రిలో చేరింది.

నొప్పులు రావడంతో డాక్టర్ స్వర్ణా రెడ్డి ఆమెకు వైద్య పరీక్షలు చేసి ఆ తరువాత ఆపరేషన్‌ చేశారు. ఓకే కాన్పులో ముగ్గురు జన్మించారు. మొదట బాబు, తర్వాత ఇద్దరు ఆడశిశువులు జన్మించారు.

ముగ్గురు శిశువులు రెండు కిలోల చొప్పున సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. మొదటి కాన్పులో ముగ్గురు జన్మించడంతో భర్త సాయన్న, కుటుంబీకులు పిల్లలను చూసి మురిసిపోయారు