ఖండాలు దాటిన అయోధ్య రామయ్య ఖ్యాతి.. ఆఫ్రికన్ యువకుడు కైలీ పాల్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్…

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామ్‌లాలా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ యువకుడు కైలీ పాల్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు..ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా.
https://www.instagram.com/reel/C2IBukbtjUW/?igsh=MTFwNDBlNDd4M2g2dg==
కిలి పాల్ ఇతను తరచుగా భారతీయ పాటలకు పెదవి సింక్ చేస్తూ, బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు రామ్‌లాలా ‘ప్రాణప్రతిష్ఠ’ వేడుకకు ముందు అయోధ్యకు వెళ్లాలన్న కోరికను ఆయన సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అతను ‘రామ్ సియా రామ్’ శ్లోకాన్ని పాడారు.

ఈ వీడియోలో కిలీ పాల్ ఆవులతో నిలబడి కనిపించాడు. త్వరలో రామజన్మభూమిని సందర్శించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వీడియోను షేర్ చేసిన తర్వాత, కైలీ క్యాప్షన్‌లో ఇలా రాశాడు. నేను అయోధ్యకు రావడానికి ఎంత ఆత్రంగా ఉన్నానో మీకు తెలుసా. నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకుంటున్నాను. నాకు రాముడి ఆశీస్సులు కావాలి ‘జై శ్రీరామ్’ అని రాశారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటారు..