నల్లగొండ రైతులకు అన్యాయం జరుగుతోంది… కోమటిరెడ్డి

నల్లగొండ రైతులకు అన్యాయం జరుగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkata Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ద్వారా నల్లగొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని.. పాలమూరు-రంగారెడ్డికి కేటాయిస్తూ జీవో 246 తెచ్చారని విమర్శించారు. ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో విడుదల చేశారని తెలిపారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జీవో 246ని రద్దు చేయకుంటే దీక్షకు సిద్ధమని ప్రకటించారు. జీవో రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని అవసరమైతే కలుస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు..