అద్దంకి దయాకర్ ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయరు..?…దాసోజు శ్రవణ్ మాట్లాడిన ప్రతి మాటలో నిజముంది.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

మరోసారి కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ మొదలైంది.. అద్దంకి దయాకర్ తనపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు…

బిడ్డ కోమటిరెడ్డి అంటే ఏంటో చూపిస్తా…
రేపు ఎల్లుండి లో నేనంటే ఏంటో చూపిస్తా తమాషా చేసే వారికి తాను అంటే ఏమిటో చూపించి తీరుతా… మీటింగులు పెట్టుతూ ఆహ్వానాలు అందించరా పిలవని పేరంటానికి నేను రావాలా..
తనపై వ్యక్తిగత కక్షతోనే పార్టీలో తనపై వివక్ష చూపుతున్నారని అన్నారు.. మీటింగ్ పెట్టి పార్టీలో ఉన్న వ్యక్తి పైన వ్యక్తిగత దూషణలు చేస్తారా అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానంతో తేల్చుకుంటానన్నారు. సోనియా, రాహుల్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై జరుగుతున్న సమావేశాలకు ఎలాంటి ఆహ్వానం లేదని, పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు. దాసోజు శ్రవణ్‌ మాట్లాడిన ప్రతిమాటా కరెక్టే అంటున్నారు వెంకటరెడ్డి. తనను తిట్టిన అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి….

దాసోజు శ్రవణ్ మాట్లాడిన ప్రతి మాటలో నిజముందని అన్నారు.. కాంగ్రెస్ పార్టీలో కొందరు పార్టీని నాశనం పట్టించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు..