కేటిఆర్ పై కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్…

వ్యవసాయం గురించి తనకు మాత్రమే తెలిసినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని టీ పీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు కేటీఆర్ అమెరికాలో వున్నారన్నారు. హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారంతా టీడీపీ నుండి వచ్చిన వారే కదా అని ఫైర్ అయ్యారు..రేవంత్ రెడ్డిని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని కారు పార్టీ నేతలపై మండిపడ్డారు. బషీర్ బాగ్ కాల్పులు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో లేరని తెలిపారు. కేసీఆర్ టీడీపీలో వున్నారన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరికో అంటగట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతు వేదికల చర్చలో గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొని అధికార పార్టీ నాయకులను ప్రశ్నించండన్నారు. రైతు వేదికలను బీఆర్ఎస్ నేతలు తమ ప్రచారానికి వాడుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రశ్నించిన తర్వాతనే రైతులకు కరెంటు ఇస్తున్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం కోసమే ఢిల్లీలో బీజేపీ నేతలను కేటీఆర్ కలిశారని ఆరోపించారు. ఢిల్లీలో మనీష్ సిసోడియాను అరెస్టు చేసినప్పుడు ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు.