కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణను విముక్తి కలిగించాలి.కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి…

కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణను విముక్తి చేసేందుకు సర్వార్ సర్వాయి పాపన్న స్పూర్తితో ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. హైద్రాబాద్ చిక్కడపల్లిలోని సర్ధార్ సర్వాయి పాపన్న‎గౌడ్ పోస్టల్ కవర్‎ను‎ వారు లాంఛనంగా ఆవిష్కరించారు. గీత కార్పోరేషన్ ఫెడరేషన్ కు ఛైర్మెన్ నియమించని కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. గీత వృత్తిపై ఆధారపడిన వారిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో మోడీ కేబినెట్లో 27 మంది ఓబీసీలకు యూపీలో 22 మంది ఓబీసీలకు పెద్దపీట వేసిందన్నారు. పాపన్న గౌడ్ సేవలకు గుర్తింపుగా.. పోస్టల్ కవర్ ను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం అడగగానే అనుమతించిందన్నారు…