భూములు అమ్మితే తప్పించి ప్రభుత్వం నడిచే పరిస్దితి..బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒప్పందం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములు అమ్మితే తప్పించి ప్రభుత్వం నడిచే పరిస్దితి లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుని భూములు తీసుకున్నాయని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని.. ఆసరా పించన్లు ఇచ్చి.. మద్యం పేరుతో దండుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. గ్యాస్ ధరలు తగ్గిస్తే అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. పెట్రోల్, గ్యాస్ ధరలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు.

అంతకుముందు బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కండకావరంతో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్ధులు , మహిళలపై కూడా లాఠీఛార్జ్ చేయిస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.