కేసీఆర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ వినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి…

మతపరమైన హింసను భాజపా ఎక్కడా రెచ్చగొట్టలేదు: కిషన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. అది ఆయనకు తగదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ వినాలంటేనే ప్రజలు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బాధ్యత గల సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మతపరమైన హింసను భాజపా ఎక్కడా రెచ్చగొట్టలేదని చెప్పారు. తెరాస నేతల ప్రచారం రైతులను తప్పుదారి పట్టించేలా ఉందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాల్సి మంత్రులు దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.