కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గుర్నీ ఎవరూ ఛాలెంజ్ చేయలేరు..కేశవరావు ఆ పార్టీ లీడర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు..!

కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గుర్నీ ఎవరూ ఛాలెంజ్ చేయలేరు…

కేశవరావు ఆ పార్టీ లీడర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ఎవరూ ఛాలెంజ్ చేయలేరని, వాళ్లు ముగ్గురు మోస్ట్ టాలెంటెడ్ లీడర్స్ అని కొనియాడారు.

24 గంటలూ పని చేయాలనే ఆలోచనతో ఉంటారని అన్నారు.

*ఆ పార్టీలో తనకు కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారని, మరెక్కడా తనకు అంత గౌరవం దక్కలేదని కేకే అన్నారు..

అంతకు ముందు..బీఆరెస్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కే కేశవరావుపై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యం, పదవులను ఇచ్చినప్పటికీ ఎందుకు పార్టీ వీడుతున్నారంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. గురువారం ఎర్రవెల్లి ఫౌమ్‌హౌస్‌కు కేకేను, ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మిని కేసీఆర్‌ పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా కేకే తాజా రాజకీయ పరిస్థితులు, తన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా తన పార్టీ మార్పుపై చోటుచేసుకున్న ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. కేసీఆర్‌ మధ్యలో కల్పించుకుని సాకులు చెప్పవద్దని కటువుగానే చెప్పారని తెలిసింది. పదేళ్ల పాటు పదవులు అనుభవించి అధికారం పోగానే పార్టీ మారుతున్నారంటూ బీఆరెస్ నేతల తీరుపై కేసీఆర్ అసహనం వెళ్లగక్కారని సమాచారం..!