పొలాలకు నీళ్లు ఇవ్వకుంటే మేమే గేట్లు ఎత్తుతాం అని రంగంలో దూకిన రైతులు..

పొలాలకు నీళ్లు ఇవ్వకుంటే మేమే గేట్లు ఎత్తుతాం అని రంగంలో దూకిన రైతులు

ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత.

పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టిన పాలేరు నియోజకవర్గం రైతులు.

పాలేరు పాతకాలం కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల పొలాలను కాపాడాలంటూ రైతుల నినాదాలు.

సాగునీరు విడుదల చేసేంతవరకు వెళ్ళేది లేదంటూ జాతీయ రహదారిపై బైఠాయింపు.

అధికారులు స్పందించకపోవడంతో పాలేరు లాకులు ఎత్తి నీటిని విడుదల చేసిన రైతులు.

అడ్డుకున్న పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులు. రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం.

20వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నదాతల ఆగ్రహం.

గతంలో రెండు సార్లు విజ్ఞప్తి చేసిన కనీసం స్పందించలేదని అధికారులపై మండిపడ్డ రైతులు.