19 వ వార్డు లో brs పట్టణ మహిళ అధ్యక్షురాలు రోజా రమణి ఆధ్వర్యంలో BRS పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బొట్టు పెట్టి ఆహ్వానం.

కోదాడ పట్టణంలో 19వవార్డు లో brs పట్టణ మహిళ అధ్యక్షురాలు రోజా రమణి ఆధ్వర్యంలో BRS పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బొట్టు పెట్టి ఆహ్వానం…

కోదాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు, వార్డు ఇంచార్జ్ ఇర్ల రోజారమణి మాట్లాడుతూ.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారని.. క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యే సారథ్యంలో నడుస్తోంది అన్నారు… అన్ని వార్డుల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పట్టణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాని విజయవంతం చేయాలని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టి సీనియర్ నాయకులు పోటు రంగారావు, నల్లజాల శ్రీనివాస్, జడ్పిటిసి కృష్ణకుమారి , సంగిశెట్టి గోపాల్, మౌలానా, ఇమ్రాన్ , మల్లెల ప్రకాష్ , యాదగిరి, స్టాలిన్, రమణ తదితరులు పాల్గొనడం జరిగినది.