కోదాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అసమతి రాగాలు.కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి టికెట్ కేటాయిస్తే..పార్టీకి సహకరించమని తేల్చి చెప్పిన అసమ్మతి వర్గం..

*సూర్యాపేట జిల్లా:-
కోదాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుండి బిఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలుగా చీలి పోటాపోటీగా సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విషయం అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పి గానే మారింది.. ఎమ్మెల్యే టికెట్ బొల్లం మల్లయ్యకు కేటాయిస్తున్నట్లు కూడా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంటికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య వెళ్లి కలిసిన కానీ అక్కడ కనీసం స్పందించకపోవడంతో ఇంకా వీరందరూ కలిసి పనిచేసే అవకాశమే లేదని స్పష్టంగా తెలిసిపోయింది.. అందులో భాగంగానే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని అసమతి వర్గం నాయకులు నేడు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు. ఏకతాటిపై ఒక తీర్మానం చేయడం జరిగింది..
*-కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి టికెట్ కేటాయిస్తే.. పార్టీకి సహకరించమని తేల్చి చెప్పిన అసమ్మతి వర్గం.
*-2018 ఎన్నికల్లో కేసీఆర్ సూచనతో.. బొల్లం మల్లయ్య యాదవ్ ను గెలిపించుకున్నం: మాజీ ఎమ్మెల్యే చందర్ రావు.*
*-కోదాడ టికెట్ బొల్లం మల్లయ్య యాదవ్ కి కేటాయిస్తే.. రెబల్ గా పోటీ చేస్తా అంటూ నియోజకవర్గ మాజీ ఇంచార్జి శశిధర్ రెడ్డి తెలిపేరు.. గతంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకులు, ప్రజలు సహకరిస్తేనే 700 ఓట్లతో గెలిచిండు. నాయకులు, ప్రజలు అందరూ వ్యతిరేకంగా ఉంటే ఎలా గెలుస్తాడు అన్ని ప్రశ్న.-బీఆర్ఎస్ పార్టీ నుంచి శశిధర్ రెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరిన నియోజకవర్గ వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు…గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే ఎమ్మెల్యే బొల్లంకు పోలైన ఓట్లు 11వేలు మాత్రమే: అసమ్మతి నేతలు.-ఇప్పుడు పోటీచేస్తే 11 వేల ఓట్లు రావని ఎద్దేవా: అసమ్మతి నేతలు.
*-కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి మళ్ళీ టికెట్ కేటాయిస్తే.. అవినీతిగా కేరాఫ్ అడ్రస్ గా మారుతుందని హెచ్చరిక: అసమ్మతి నేతలు..
*-కోదాడ నుండి బొల్లం మల్లయ్య యాదవ్ కి టికెట్ ఒడిస్తాం: అసమ్మతి నేతలు.*
*-బొల్లం మల్లయ్య యాదవ్ ఓడిపోవడం ఖాయం.. కేసీఆర్ కు తెలిసే కోదాడ టికెట్ కేటాయించారు: అసమ్మతి నేతలు.