మధ్యపాన నిసేధానికి చంద్రబాబు తూట్లు పొడిచిన ఘనుడు.. ఆయన హయాంలో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారింది….మంత్రి కోడెల నాని.

సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న టిడిపి సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి కోడెల నాని స్పీకర్ ను కోరారు.
వాయిదా పడిన తర్వాత ఏపీ అసెంబ్లీ సోమవారం నాడు ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే ఏపీ మంత్రి అప్పలరాజు ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై చర్చకు పట్టుబడ్డారు…ఈ సమయంలో ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు…మద్యపానం గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ తీసుకువచ్చారన్నారు.అయితే మధ్యపాన నిసేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని మంత్రి నాని విమర్శించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లతో మద్యపానాన్ని చంద్రబాబు ప్రోత్సహించారన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పాలించిన ఘనత చంద్రబాబుదే అని కొడాలి నాని చెప్పారు.ఎన్టీఆర్ మద్యపానం నిషేధిస్తే చంద్రబాబునాయుడు బెల్ట్ షాపులు తెరిచి మద్యాన్నిఏరులై పారించారన్నారు.జంగారెడ్డి గూడెంలో సహజ మరణాలను కూడా టీడీపీ వక్రీకరిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో బెల్గ్ షాపులను తమ ప్రభుత్వం నిర్మూలించిందన్నారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు…