నీ బాబు ఏం పీకుతాడు అని మాట్లాడాడని..ఈరోజు జగన్ పీకి చూపించారు..కొడాలి నాని..

కొడాలి నాని (kodali nani) మరోసారి చంద్రబాబు నాయుడపై (chandrababu naidu) ఆరోపణలు చేసారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు నీ బాబు ఏం పీకుతాడు అని మాట్లాడాడని..ఈరోజు జగన్ పీకి చూపించారని ఎద్దేవా చేసారు. అధికారం పోయాక చంద్రబాబు కమీషన్లు తీసుకునేవాడని.. ఇప్పుడు ఆయన బెయిల్‌పై బయటికి వచ్చినా ఎందకూ పనికిరాడని అన్నారు.

“” చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లు ఆయన ఏ తప్పూ చేయలేదని వాదించకుండా 17ఏ ఆయనకు వర్తించదని.. గవర్నర్ పర్మిషన్ తీసుకుని ఆయన్ను అరెస్ట్ చేయలేదని వాదిస్తున్నారు. చంద్రబాబు ఓ పెద్ద దొంగ అని చెప్పడానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి. ఇక పవన్ కళ్యాణ్ మాకు 15 సీట్లు వస్తే గొప్ప అంటున్నాడు. మాకు 125 సీట్లు వస్తాయని ఓసారి చెప్పిందే పవన్. పవన్, చంద్రబాబు కూటమికి 25 సీట్లు మాత్రమే వస్తాయి. మొరిగే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు. పవన్ మాది పావలా ప్రభుత్వం అన్నాడు. ఆయన్ను పావలా కళ్యాణ్ అంటారు. ఆయన పావలా.. మేం రూపాయి పావలా “” అని తెలిపారు.