మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తాం..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి …

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి ఆయన పర్యటించారు. కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో ప్రధానమైనది రూ.2,945 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం. అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి.. వారితో ముఖాముఖిలో పాల్గొన్నారు. అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేస్తామని.. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు  చేపడతామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు……