కోడికి రాఖీ కట్టి ప్రేమను చాటుకున్న కుటుంబం..

రక్షా బందన్ పండగ అంటే అన్నా చెల్లెల్ల అనురాగానికి ప్రతీక… ఇదంతా ఒక వైపు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి లో ఎవరు ఊహించని విధంగా మరో ఘటన చోటు చేసుకుంది.. అందరూ మానవులే కట్టుకుంటే ఏం బాగుంటుందో అనుకున్నారు వారింట్లో ఉన్న మూగజీవి పై తమ ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు..

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఓ కుటుంబం ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకుంటున్న ఓ కోడి పిల్లకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి ఆనందంగా జరుపుకున్నారు..

ఉదయాన్నె స్నానం చేయించి వారితో పాటు వరస క్రమంలో మధ్యలో కూర్చోపెట్టి బొట్టి పెట్టి, రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు….

కానీ ఈ కోడికి భలే రాజయోగం వచ్చిందిగా అనుకుంటూ నేటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు… ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..