కోహ్లీ అవుట్ సమయంలో అనవసర వ్యాఖ్యలు చేసిన బంగ్లా ఆటగాళ్లు…!! ఆగ్రహించిన కోహ్లీ…

టిమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలు కొనితెచ్చుకుంది..మరో 10 ఓవర్లు నిలబడితే రోజు ముగుస్తుందనగా టీమిండియా బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో వికెట్లు పారేసుకున్నారు. టీమిండియా టాపార్డర్‌ కేఎల్‌ రాహుల్‌, గిల్‌, పుజారా, కోహ్లి ఇలా నలుగురు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 100 పరుగులు చేయాల్సి ఉంది. బంతి బాగా టర్న్‌ అవుతుండడంతో నాలుగోరోజు టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.ఇక కోహ్లి తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచాడు. బంగ్లా ఇన్నింగ్స్‌ సమయంలో బ్యాటర్‌ నజ్ముల్‌ శాంటో సమయం వృధా చేస్తున్నాడని చిర్రెత్తిన కోహ్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్‌ అయింది. తాజాగా టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో కోహ్లి ఔటయ్యాకా బంగ్లా ఆటగాళ్ల చర్య అతనికి మరోసారి కోపం తెప్పించింది.
అప్పటికే డీఆర్‌ఎస్‌ ద్వారా ఎల్బీ నుంచి తప్పించుకున్న కోహ్లి.. మిరాజ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయాడు. మిరాజ్‌ ఫ్లైట్‌ డెలివరీ వేయగా.. షాట్‌ కొట్టబోయిన కోహ్లి షార్ట్‌లెగ్‌లో ఉన్న మోమినుల్‌ హక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే కోహ్లి ఔటైన సందర్భంగా బంగ్లా క్రికెటర్లు కోహ్లిని హేళన చేస్తూ గట్టిగట్టిగా అరిచారు. ఇది గమనించిన కోహ్లి వారివైపు కోపంగా చూస్తూ అక్కడే నిలబడ్డాడు. ఇంతలో అక్కడికి వచ్చిన షకీబ్‌ అల్‌ హసన్‌తో ఇలా చేయడం కరెక్ట్‌ కాదు అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…