సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..

సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

వన్డేల్లో 50 సెంచరీలు కొట్టిన విరాట్ కోహ్లీ..
విరాట్ కోహ్లీ – 674* (2023)
సచిన్ టెండూల్కర్ – 673 (2003)
మాథ్యూ హేడెన్ – 659 (2007)
రోహిత్ శర్మ – 648 (2019)
డేవిడ్ వార్నర్ – 647 (2019.

భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. వాంఖ‌డేలో న్యూజిలాండ్‌తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 79 ప‌రుగులు చేయ‌డం ద్వారా స‌చిన్ రికార్డును కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టాడు. 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌చిన్ 673 ప‌రుగులు చేశాడు. దాదాపు 20 ఏళ్లుగా ఈ రికార్డు ప‌దిలంగా ఉండ‌గా తాజాగా కోహ్లీ దాన్ని బ‌ద్ద‌లు కొట్టాడు..

*50 సెంచరీలతో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్ సృష్టించారు..*

ముంబై స్టేడియంలో ఎదురుగా సచిన్ మ్యాచ్ చూస్తుండగా, ఆ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి 50 సెంచరీలతో చరిత్ర సృష్టించారు విరాట్ కోహ్లీ..

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును 49తో సమం చేశారు విరాట్.

ఈరోజు ఆ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ న్యూజీలాండ్ పై మరో సెంచరీతో సచిన్ రికార్డు బద్దలు కొట్టారు.

ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చూపించాడు.

ఎనిమిది మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

*సెంచరీలతోనే కాకుండా విరాట్ మరో సచిన్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 694 పరుగులతో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశారు*.

ఇప్పటివరకు ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ పేరిట ఉండేది. దానిని ఈరోజు విరాక్ బ్రేక్ చేశారు.

2003లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు.