కోకాపేట భూములకు భారీ డిమాండ్. ఎకరం 100 కోట్లు..!

ఎకరం భూమి ధర కోటి రూపాయలు. ఏంటి షాక్ అయ్యారా? కోటి రూపాయలా అని నివ్వెరపోతున్నారా? అవును నిజమే. ఎకరం భూమి రేటు అక్షరాల కోటి రూపాయలే. ఇదెక్కడో తెలుసా. హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న కోకాపేట (kokaapeta). అక్కడ నియోపొలిస్ భూములకు(land) భారీ డిమాండ్ వచ్చింది. వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. 45 ఎకరాలకు ప్రభుత్వం రూ.2వేల 500 కోట్లు ఆశిస్తోంది. దీంతో పాటు ఇతర పన్నులు, ఫీజుల రూపంలో మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నారు….నియో పోలిస్‌ భూముల వేలంలో ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 67.25 కోట్లు పలికింది. నియో పోలిస్‌ ఫేజ్‌-2లోని ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీ పడ్డారు. నియో పోలిస్‌ ఫేజ్‌-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఉదయం 26.86 ఎకరాలకు వేలం పూర్తవ్వగా.. సాయంత్రం నుంచి 10, 11, 14 నెంబరు ప్లాట్లకు
(18.47 ఎకరాలకు) వేలం నిర్వహించారు.

ప్రభుత్వం నిర్ణయించిన అప్సెట్ ప్రైస్ 1586.55 కోట్లు కాగా.. వేలంలో పలికిన ధర 3319.60 కోట్లుగా ఉంది. 10వ నెంబర్ ప్లాట్ ను ఎకరానికి 100.75 కోట్ల ధరతో 3.60 ఎకరాలను 362.70 కోట్లకు హ్యాపీ హైట్స్ నియో పోలీస్, రాజ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్(Ltd) దక్కించుకున్నాయి.

ఆరవ నెంబర్ ప్లాట్ లో ఏడెకరాలకు, ఎకరానికి 73 కోట్ల చొప్పున మొత్తం 511 కోట్ల ఆదాయం వచ్చింది.
ఏడవ ప్లాటులో ఎకరానికి 75 కోట్ల 50 లక్షలు చొప్పున మొత్తం 494.53 కోట్లు వచ్చాయి.
8వ ప్లాటు లో 9.71 ఎకరాలకు, ఎకరానికి 68 కోట్ల చొప్పున మొత్తం 660.28 కోట్లు పాడారు.
9వ ప్లాటు లో 3.60 ఎకరాలకు, 75.25 కోట్ల చొప్పున మొత్తం 270.90 కోట్లు వసూలయ్యాయి.
పదవ ప్లాట్ లో 3.60 ఎకరాలకు, దానికి 100.75కోట్ల చొప్పున 362.70 కోట్లు పలికి రికార్డు సృష్టించింది.
11వ ప్లాట్ లో 7.53 ఎకరాలకు, ఎకరానికి 67.25 కోట్ల చొప్పున 506.39 కోట్లు వచ్చాయి.
14వ ప్లాట్ నెంబర్ లో ఎకరాలకు, దానికి 70 కోట్లు చొప్పున 513.80 కోట్లు పలికింది…