పంజాబ్‌పై కోల్‌కతా ఘన విజయం…

రస్సెల్ రెచ్చిపోయి ఆడటంతో 33 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది.....

రసెల్ మెరుపు ఇన్నింగ్స్‌.
.ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. రస్సెల్ రెచ్చిపోయి ఆడటంతో 33 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది. కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణించాడు. 15 బంతుల్లో 5 ఫోర్లు బాది 26 పరుగులు చేశాడు. సామ్ బిల్లింగ్స్ కూడా సేమ్ టు సేమ్. 23 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అజింక్య రహానె 12 పరుగులు చేశాడు….

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ కేవలం 137 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్ చివరి బంతికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయి 102 పరుగులకే 8 వికెట్లు నష్టపోయింది. దీంతో పంజాబ్ 120 స్కోర్ అయినా సాధిస్తుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. చివరలో రబడా 16 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు బాది 25 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది…

138 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ స్టార్టింగ్‌ నుంచే దుమ్మురేపారు. వెంకటేష్ అయ్యర్, నితిష్ రానా తప్ప.. మిగిలిన ఐదుగురు ప్లేయర్స్ మంచి ఆట తీరు కనబరిచారు… ఇర రస్సెల్ అయితే చెప్పనక్కర్లేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చేశారు… 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను బాబోయ్ అనిపించేలా చేశాడు. కేవలం 31 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 14.3 ఓవర్లకే నిర్దేశిత లక్ష్యాన్ని చేరి టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. కోల్‌కతా గెలుపులో శ్రేయాస్ అయ్యర్(26), సామ్ బిల్లింగ్స్(24), అజింక్య రహానె(12) కృషి కూడా సూపర్ అని చెప్పాలి.

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు కూడా విధ్వంసం సృష్టించారు. తమ దూకుడు బౌలింగ్‌తో పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను ఆగమాగం చేసి.. వరుసగా వికెట్లు తీసుకున్నారు. ఉమేష్ 4, సౌతీ 2, శివమ్ మావి, నరైన్, రస్సెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. .