స్థానిక టీఆర్‌ఎస్ నేత తనయుడు రోడ్డు ప్రమాదంతో మృతి చెందడంతో.. నివాళులు అర్పించడానికి వెళ్లి కన్నీరు పెట్టినా ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమోషనల్ అయ్యారు. స్థానిక టీఆర్‌ఎస్ నేత తనయుడు రోడ్డు ప్రమాదంతో మృతి చెందడంతో..

ఎమోషనల్ వీడియో చూడాలంటే లింకును ఓకే చేయండి..
https://youtu.be/E76NTE5doNk

నివాళులు అర్పించడానికి వెళ్లి కన్నీరు పెట్టారు…
మంగళవారం శంషాబాద్(Shamshabad) మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్ రోడ్ వద్ద యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో వెర్నా కారు దాన్ని బలంగా ఢీకొట్టింది. కారు బోల్తా పడటంతో అందులోని యువకుడు స్పాట్‌లోనే మరణించాడు.. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ లీడర్, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి తనయుడు దినేష్‌ రెడ్డి. చేతికందివచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దినేష్‌ రెడ్డి కళ్లను పేరెంట్స్ దానం చేశారు. ఆరు నెలల కిందే దినేశ్‌కు పెళ్లి జరిగింది..

కోమటిరెడ్డి ఎమోషనల్ అయ్యారు. అప్రయత్నంగానే ఆయన కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. తరిమి వస్తున్న దు:ఖాన్ని దిగమింగుతూ ఆయన దినేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజంట్ ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకైక తనయుడు ప్రతీక్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందారు. ఆయన జీవితంలో తనకొడుకును ఇలానే కోల్పోవడం గుర్తుకు తెచ్చుకొని భావించారు.. ఈ వాదన మాటల్లో చెప్పుకోలేక కన్నీళ్లు రూపంలో వెళ్ళబుచ్చారు..