తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర అధ్యక్షుడినే మార్చేసింది. ఈటల రాజేందర్ కీలక పదవి ఇచ్చింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమించింది ఆ పార్టీ హైకమాండ్. ఈ మేరకు బుధవారం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు..
పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పోస్టు ఇచ్చింది..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ ఆయనకు పదవి ఇచ్చింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల అమిత్ షా ను కలసిన సందర్భంలో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు రాజగోపాల్ రెడ్డి.