కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లైట్ తీసుకుందా..!?.. మొదటి నుండి రాజగోపాల్ రెడ్డి అటు ఇటునే..!!?

రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి గోడ మీద పిల్లి తరహా రాజకీయాలు చేస్తున్నారా ..???
2018లో కాంగ్రెస్ ఓడిపోగానే.. ఆయన బీజేపీలో చేరిపోతానంటూ వెళ్లారు…చేరక ముందే అక్కడ ఆయన అతిని తట్టుకోలేకపోయారా..!?. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రచారం చేసుకోవడం ప్రారంభించడంతో మొదట్లోనే వారి వ్యవహార శైలి తెలియడం తో బిజేపి కత్తిరించేశారా..!. తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడటం ప్రారంభించారు. అసెంబ్లీకి హాజరయ్యారు. బండి సంజయ్ బీజేపీ చీఫ్ అయ్యాక.. ఆ పార్టీ కొద్దిగా పుంజుకోవడంతో మళ్లీ ఆ పార్టీ బాట పట్టారు. అనే విమర్శలూ ఉన్నాయి..

చివరికి మునుగోడులో రాజీనామా చేస్తానని ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎక్కడా లేనంత ఊపు వస్తుందని చెప్పి నమ్మించి అదే పని చేశారు. ఆయనకు సోదరుడు కూడా పరోక్షంగా అండగా నిలిచారు. తీరా.. మునుగోడులో ఓడిపోవడంతో… బీజేపీకి అప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోయింది అనే ప్రచారం జరిగింది… దీంతో రాజగోపాల్ రెడ్డితో చేసిన ప్రయోగం వికటించినట్లయింది. బీజేపీ పలుకుబడి తగ్గిపోవడంతో రాజగోపాల్ రెడ్డి కూడా జంప్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఆని ప్రచారం జరుగుతోంది… బీజేపీలో ఆయనకు రెండు పదవులు ఇచ్చినా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు..కాంగ్రెస్ లో చేరాలని ప్రజల నుంచి ఒత్తిడి ఉందని ఆయన చెబుతున్నారు. ఆయన సోదరుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి… ఆ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం.. వెంటనే మునుగోడు టిక్కెట్ దక్కడం సులువే. కానీ ఇలాంటి వారిని నమ్ముకున్న రాజకీయ పార్టీలు మాత్రం నిండా మునిగిపోతాయని బీజేపీ ఉదంతమే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటు కొందరు సామాజిక మాధ్యమంలో మెసేజ్లు చేస్తూ హల్చల్ చేస్తున్నారు..