కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

*🔹కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నేత కోమటిరెడి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు.

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయంటూ నాలుగు రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల్లో మార్పులు, చేరికలు జరుగుతున్నాయి … ఈ తరుణంలో ఇప్పటికే పార్టీ మారిన పలువురు కీలక నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పలు పార్టీల్లో అలజడి మొదలైంది. తెలంగాణలో హస్తం పార్టీ పుంజుకుంటుందా..? లేదా.. ఏదైనా మార్పు జరుగుతుందన్న విషయం పక్కన పెడితే.. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు ….వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం వీరు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉంది.

అలానే brs పార్టిలో కుడా చేరికలు జోరుగా సాగుతోంది… టీటీడీపీ నుండి కొందరు BRS లో చేరికలు కుడా జరిగిపోతుంది.