కాంగ్రెస్ పార్టీపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

పార్టీ మార్పు పై చెప్పకనే చెబుతున్నా రాజగోపాల్ రెడ్డి…. ఏ క్షణంలో ఏం నిర్ణయం తీసుకున్నా తనకు కార్యకర్తలు భరోసా ఉండాలి….

గౌరవం ఇవ్వని చోట ఉండలేను:- *రాజగోపాల్‌ రెడ్డి…

తనకు గౌరవం ఇవ్వని చోట ఉండలేనని కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎవరి కిందపడితే వారికి కింద పనిచేయలేనని చెప్పారు.

ఈ మేరకు ఏవిషయం పై ఆయిన కేసీఆర్‌పై పోరాడుతానని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.

తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చనని వెల్లడించారు..

పార్టీ మార్పు పై నేను కార్యకర్తలు అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాను..

గతంలో పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యే లు ఎవ్వరికీ చెప్పి పార్టీ మారారు….. కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికి విలువలేదు యుద్ధం చేసే వాడికి కత్తి ఇవ్వడం లేదు… అంటూ కార్యకర్తల సమావేశంలో చెప్పకనే పార్టీ మారతారా అనే సంకేతాలు ఇచ్చేశారు.