కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు…

*కోమటిరెడ్డికి గుడ్‌న్యూస్..
కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్…

కీలక నేత, మాజీ మంత్రి, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. 2023 శాసన సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆదివారం శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టీపీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, నిరాశ చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆలస్యమైనా.. పార్టీ శుభవార్త చెప్పిందని కాంగ్రెస్ శ్రేణులు, వెంకట్ రెడ్డి అభిమానులు సంతోషంలో ఉన్నారు..