యాదాద్రి పేరు మార్పు పరిశీలనలో ఉంది:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో నే జీవో ఇస్తామని తెలి పారు.ఇప్పటికే ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిల య్య ప్రకటన చేశారు.

తాజాగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో యాదాద్రి పేరుమార్పుపై స్పందించారు. భువనగిరి నుంచి పోటీ చేయమని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చెప్పానన్నారు.

భువనగిరి, నల్లగొండ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో దక్షిణ భారతదేశంలోనే భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుస్తుం దని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కంటే రాహుల్ అత్యధిక ఓట్లతో గెలుస్తారని చెప్పారు.