సీఎం రేవంత్ రెడ్డితో కోనప్ప..

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటి చేయబోతున్నాయని కేసీఆర్, ఆర్ఎస్పీ ఉమ్మడి ప్రకటన చేసిన మరుసటి రోజే ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్‌లో ఆర్ఎస్పీ చిచ్చు రగిలింది.

గత ఎన్నికల్లో సిర్పూర్‌లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. దీంతో ఓట్లు చీలడం వల్లే తమ నేత ఓడిపోయారని కోనప్ప అనుచరులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాను కేసీఆర్‌కు ఎంతో గౌర వించినా బీఎస్పీతో పొత్తు విషయంలో తనతో ఓ మాటైనా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడంపై కోనప్ప మండిపడ్డారు.

కేసీఆర్ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.