డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న:మంత్రి కొండ సురేఖ..

తెలంగాణ అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. డెంగీ జ్వరంతో ఆమె బాధపడుతున్నారు.

మంత్రి కొండా సురేఖ ప్రస్తుత పరిస్థితిపై ఆమె మాటల్లోనే వినండి.. క్రిందా విడియో లింక్ క్లిక్ చేయండి.

https://youtu.be/Vu2Vlfb8mWY?si=Jmx9x1Z6hjgJJNg1
తన మంత్రిత్వ శాఖల కార్యక్రమాలను హైదరాబాద్ లోని తన నివాసం నుంచే ఆమె పర్యవేక్షిస్తున్నారు. జ్వరంతో గత ఐదు రోజులుగా ఆమె బాధ పడుతున్నారు. జ్వరం తగ్గక పోవడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా డెంగీ అని బయటపడింది. జ్వరంతో బాధ పడుతూనే మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన సలహాలు ఇస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు..

గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నానని, ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు,ఆమె పేర్కొన్నారు…