మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీ గూటికి..!!!

టీఆర్ఎస్ను ఓడించే సత్తా కాంగ్రెస్కు లేదు...!!

మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ గూటికి చేరబోతున్నారు. త్వరలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. గత రెండేళ్లుగా తెలంగాణ కోసం ఏది మంచిదైతే బాగుటుందని వివిధ రాజకీయ వ్యక్తులతో చర్చించానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోతేనే తెలంగాణ బాగుపడుతుందని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసే శక్తి బీజేపీకే ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ను ఓడించే సత్తా కాంగ్రెస్కు లేదన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన..ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయిందని..త్వరలో ఇతర రాష్ట్రాల్లోని ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోతుందని జోస్యం చెప్పారు…