కొండగట్టు అంజన్న క్షేత్రానికి మరో రూ.500కోట్లు: సీఎం కేసీఆర్‌.

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100కోట్లు ప్రకటించామని.. మరో రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు.