కొండపొలం మూవీ రివ్యూ …

పంజా వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కోట శ్రీనివాస్ రావు , నాజర్ , సాయి చంద్

Producers :- వై. రాజీవ్ రెడ్డి , జె . సాయి బాబు.

Music Director :- కీరవాణి

Director:- క్రిష్ జాగర్లమూడి.
మూడు నాలుగు నెలల్లో ఓ సినిమాను రిలీజ్ చేస్తుంటారు. సినిమాను తీయడంలో ఎవరి ప్రత్యేకత వారిదే. తాజాగా ఈరోజు విడుదలైన కొండపొలం సినిమా కూడా అటువంటిదే. ఎందుకంటే.. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు కూడా చాలామందికి ఈ సినిమా గురించి తెలియదు. సినిమా గురించి ఎటువంటి ప్రచారం లేకుండా.. సైలెంట్ గా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు…
రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను క్రిష్ జాగర్లమూడి అదే పేరుతో వెండితెరకెక్కించారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే నటుడిగా గుర్తింపుతో పాటు, మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, రకుల్‌ ప్రీత్ సింగ్ జంటగా ఈ చిత్రాన్ని రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.

కథ : ఈ సినిమా కథ.. పూర్తిగా కొండపొలం నవల నుంచి తీసుకున్నదే. ఆ నవల గురించి.. దాని ప్రత్యేకత గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ముందు సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. రాయలసీయలోని కడప జిల్లాకు చెందిన రవీంద్ర యాదవ్(మన హీరో వైష్ణవ్ తేజ్) అనే యువకుడికి సంబంధించిన కథే ఈ సినిమా. తన చదువు పూర్తయ్యాక.. ఉద్యోగం కోసం రవీంద్ర హైదరాబాద్ వెళ్తాడు. కానీ.. సరైన ఉద్యోగం దొరకదు. దీంతో.. తిరిగి తన ఊరి బాట పడతాడు. తన ఊరికి వెళ్లినప్పుడు తన తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) తనకు ఒక విషయం చెబుతాడు.

కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) అనే కుర్రాడి కథ ఇది. పాతికేళ్ళ ఆ కుర్రాడు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. నగరంలో బతకలేక తన పల్లెకు వెళ్ళినప్పుడు తాత రోశయ్య (కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొందరు ‘కొండపొలం’ చేస్తున్నారని, తమ గొర్రెలనూ తీసుకుని వారితో కలిసి నల్లమల అడవికి వెళ్లమని చెబుతాడు. నెల రోజుల పాటు అడవితో సహజీవనం చేశాక రవీంద్రలో ఎలాంటి మార్పు వచ్చింది, అడవి అతనికి ఏ యే పాఠాలు నేర్పింది, ఆ అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని అతను ఎలా విజయపథంలో సాగాడన్నదే ఈ చిత్ర కథ.తానా సంస్థ నిర్వహించిన నవలల పోటీలో ‘కొండపొలం’ ప్రథమస్థానంలో నిలిచి, రెండు లక్షల రూపాయల బహుమతిని పొందింది. కథలోని అంశం,..

సినిమా లో కలిసొచ్చే వచ్చే అంశాలు :
ఈ సినిమాకు ప్లస్ పాయింట్ హీరో వైష్ణవ్ తేజ్. ఒక పల్లెటూరు యువకుడిలా తన పాత్రలో వైష్ణవ్ ఒదిగిపోయాడు. తన గొర్రెల మందను పులుల నుంచి రక్షించుకోవడం చేసిన పోరాటాలు వీరోచితంగా ఉంటాయి. వైష్ణవ్ తర్వాత తన పాత్రకు ఓబులమ్మ న్యాయం చేసింది. అడవికి వచ్చిన సమయంలో ఎంతో పిరికివాడిగా ఉన్న రవీంద్రలో ధైర్యాన్ని నూరిపోయడం, అతడిలో పట్టుదల వచ్చేలా చేయడం అన్నీ తను అవలీలగా చేసింది. కోట శ్రీనివాసరావుతో పాటు.. మిగితా నటులు అందరూ తమ పాత్రల మేరకు నటించి ఒప్పించారు. అడవి నేపథ్యంలో వచ్చే సినిమా కావడం.. ఒక నెల రోజుల పాటు అడవిలో ఉండి.. తమ గొర్రెలకు గ్రాసం అందించలేక.. తాము సరైన ఆహారం తినలేక.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. అనే కాన్సెప్ట్ కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.
ఈ సినిమాలోని మాటలు కూడా అద్భుతంగా, ఆలోచింపజేసేలా ఉంటాయి. అడవి నేర్పే పాఠాలు కావచ్చు.. అడవితో మనిషికి ఉండే బంధం కావచ్చు.. మనుషులకు, పశువులకు మధ్య ఉండే బంధం కావచ్చు.. అన్నింటినీ ఈ సినిమాలో చక్కగా చూపించారు.

కథలో అర్థం కాని అంశాలు.. : ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి. ఇది కమర్షియల్ సినిమా కాకపోవడం.. సినిమా ఎక్కువ భాగం అడవిలో సాగడమే ఈ సినిమాకు మైనస్. అలాగే.. ఈ సినిమాలో అంతగా ఆశించిన స్థాయిలో వీఎఫ్ఎక్స్ ఉండవు. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్లినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు అవసరం లేకున్నా.. ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ఎడిటర్ కొన్ని సీన్లను సెకండ్ హాఫ్ లో కట్ చేస్తే బాగుండేది…