భద్రాద్రి కొత్తగూడెంలో 13 అడుగుల కొండచిలువ హల్ చల్….

లక్ష్మిదేవిపల్లి మండలం, అశోక్‌నగర్, కల్వర్తి ప్రాంతంలో భారీ కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రాత్రి 10 గంటల సమయంలో ఎన్నడూ లేని విధంగా పంది అరుపులు వినిపించడంతో స్థానికులు అటువైపు వెళ్లారు. అక్కడ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. పందిని పట్టుకునేందుకు కొండచిలువ ప్రయత్నించడాన్ని చూసి హడలెత్తిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ల బృందం 13 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్నారు. రాక్ ఫైథాన్ జాతికి చెందిన ఈ కొండచిలువను బోనులో బంధించి అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు..