కొరియా ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో భారత్..టైటిల్ గెలిచిన సాత్విక్- సాయిరాజ్‌..

టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగోడు!

టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం!
Korea Open..
కొరియా ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో భారత స్టార్ డ‌బుల్స్ జోడి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి అద‌ర‌గొట్టింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించి కొరియా ఓపెన్ టోర్నీ విజేత‌గా నిలిచింది. దక్షిణ కొరియాలోని యోసులోని జిన్నామ్ స్టేడియంలో గెలుపొందింది. గ‌త నెల ఈ జోడి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సంగ‌తి తెలిసిందే…. నేడు ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ సాత్విక్-చిరాగ్ 17-21, 21-11, 21-13 తేడాతో టాప్ సీడ్, ఇండోనేషియా జోడీ ఫజర్ అలిప్‌యాన్-ముహమ్మద్ రియాన్‌లను ఓడించింది. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.
కొరియా ఓపెన్ టైటిల్ గెలవడం సాత్విక్-చిరాగ్ జోడీకి ఇదే తొలిసారి. దాదాపు 60 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో ఇరు జోడీలు హోరా హోరీగా తలపడ్డాయి. తొలి గేమ్‌లో ఇండోనేషియా షట్లర్లు ఆధిపత్యం చెలాయించడంతో భారత జోడీ కాస్త వెనకబడింది.

4-2తో మొదటు పెట్టిన ఇండోనేషియా జోడీ.. వరుసగా 6 పాయింట్లు సాధించి 11-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత జోడీ ప్రతిఘటించినా.. ఏమాత్రం అవకాశం ఇవ్వని ఇండోనేషియా ద్వయం 21-17తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.