సోషల్ మీడియాలో రీల్స్ పెడుతుందని రోకలి బండతో కొట్టి చంపిన అన్న!!!.
ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సమయాన్ని వాడుకుంటుంటే.. మరికొందరు శృతిమించేలా వ్యవహరిస్తున్నారు.. కొందరు తమ సొంతవారే ఇలా చేస్తున్నారని ఆవేదనలో కూడా కుటుంబీకులు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు..
అలాంటి ఘటనే ఒకటే భద్రాద్రి కొత్తగూడెం – ఇల్లందు మండలం రాజీవ్ నగర్‌కు చెందిన అజ్మీర సింధు మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు పెడుతుంది. వద్దని వారించినా వినట్లేదని ఆమె అన్న హరిలాల్ రోకలి బండతో సింధు తలపై కొట్టగా చనిపోయింది…