వెస్టిండీస్‌కు త‌న చివ‌రి మ్యాచ్ ఆడేసిన‌ట్లు సంకేతం ఇచ్చినా క్రిస్ గేల్ …

ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో ఔటైన త‌ర్వాత క్రిస్ గేల్ మైదానం నుంచి వెళ్తూ త‌న బ్యాట్‌ను స్టేడియంలోని ప్రేక్ష‌కుల వైపు ఎత్తి చూపాడు. దీంతో అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప‌లికిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. హెల్మెట్ తీసేసిన గేల్‌.. త‌న చేతిలో ఉన్న బ్యాట్‌ను ప్రేక్ష‌కుల వైపు చూపిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్ దిశ‌గా వెల్లాడు. ఫీల్డ్ నుంచి వెళ్లిన గేల్‌కు త‌న జ‌ట్టు స‌భ్యులు గ్రీట్ చేశారు. చాలా సైలెంట్‌గా త‌న‌దైన స్ట‌యిల్‌లో ప‌వ‌ర్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ .. వెస్టిండీస్‌కు త‌న చివ‌రి మ్యాచ్ ఆడేసిన‌ట్లు సంకేతం ఇచ్చాడు….ఆండ్రీ రస్సెల్‌, డ్వేన్ బ్రావో యూనివర్స్ బాస్‌ను హత్తుకోవడం.. ఆ తర్వాత తన గ్లోవ్స్‌పై సంతకం చేసి అభిమానులకు ఇవ్వడం టీవీ కెమెరాల్లో కనిపించింది. అంతేకాకుండా కెమెరా ముందుకు వచ్చి థాంక్యూ ఫ్యాన్స్‌ అంటూ గట్టిగా అరిచాడు. తన చేష్టలతో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆటకు గుడ్ బై చెప్పినట్లు క్రిస్ గేల్ హింట్ ఇచ్చాడు…