ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…

పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శ్రీ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ పోసాని వెంకట రమణారావు మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, పర్వదినాలు తెలిసేలా చేసేందుకే ఈ వేడుకలను నిర్వహించామని తెలిపారు. చిన్నారులు శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో వచ్చి అందరిని అలరించారు. గోపికలు ఉట్టి లాగుతుండగా శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ముట్టిని కొట్టేందుకు ప్రయత్నించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇన్చార్జిలు సంధ్య, సౌజన్య , పిఈటి అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.