కృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి..

ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి అర్పించారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన చెందారు. సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కృష్ణ అని అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేశారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను చాలా సార్లు చూసినట్లు తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు…