ఎమ్మెల్సీ కవితకు పంపినవి ఈడీ సమన్లు కావు.. మోడీ సమన్లు..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

ఎమ్మెల్సీ కవితకు పంపినవి ఈడీ సమన్లు కావు.. మోడీ సమన్లు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలయ్యాయన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వానికి అయితే జుమ్లా లేకపోతే హమ్లా అనేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. బీజేపీ నేతలు అవినీతి కేసుల్లో ఉన్నా దర్యాప్తులు, చర్యలు లేవని.. 2014 తర్వాత ఈడీ, సీబీఐలు ప్రతిపక్షాలపైనే దాడులు చేస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్..ఇవాళ అయితే జుమ్లా లేక‌పోత ఆమ్లా అనే విధానంలో మోదీ ప్ర‌భుత్వం ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. మా మంత్రి గంగుల మీద ఈడీ, సీబీఐ దాడులు చేయించారు. మ‌ల్లారెడ్డి మీద ఐటీ దాడులు చేయించారు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పీఏ ఇంటి మీద ఈడీ దాడి చేసింది. జ‌గ‌దీశ్ రెడ్డి పీఏ ఇంటి మీద ఐటీ దాడులు చేసింది. నామా నాగేశ్వ‌ర్ రావు మీద ఈడీ దాడులు చేయించింది. వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌పై సీబీఐ దాడులు చేసింది. పార్థ‌సార‌థి రెడ్డి, మ‌న్నె శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులు చేయించారు. ఎమ్మెల్సీ ర‌మ‌ణ‌పై ఈడీ విచార‌ణ జ‌రిపారు. మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి, పైల‌ట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. మోదీ ప్ర‌భుత్వం ఈడీ, సీబీఐ ఐటీని ఉసిగొల్పింది. అక్క‌డ చేయ‌గ‌లిగింది ఏమీ లేక‌.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగ‌మిస్తున్న విధానం, తెలంగాణ‌లో ఒక అజేయ‌మైన శ‌క్తిగా ఎదిగిన విధానాన్ని గ‌మ‌నించిన త‌ర్వాత‌ ఎమ్మెల్సీ క‌వితకు కూడా ఈడీ స‌మ‌న్లు పంపింది. ఇవి ఈడీ స‌మ‌న్లు కాదు.. క‌చ్చితంగా మోదీ స‌మ‌న్లు. ఇది రాజ‌కీయంగా చేసే చిల్ల‌ర ప్ర‌య‌త్నం. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మ‌లాగా మారాయాని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు…