అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్న కేంద్ర ప్ర‌భుత్వ.. కేటీఆర్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జయంతి వేడుకలలొ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్న కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ‌ల‌ను త‌మ ఆధీనంలో పెట్టుకుని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మీద‌కు వేట కుక్క‌ల మాదిరిగా ఉసిగొల్పుతున్న కార్య‌క‌లాపాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుదాద‌మ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. భార‌త‌దేశంలో అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం ప‌ట్ల ఎవ‌రికీ అగౌర‌వం లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఆయ‌న రాసిన రాజ్యాంగం ఏ ఒక్క వ‌ర్గానిదో కాదు.. మనఅందరిదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.