కొద్ధి రోజుల్లో నిరుద్యోగ భృతి…మంత్రి కేటీఆర్..

కొద్ధి రోజుల్లో నిరుద్యోగ భృతి..
– రేపో మాపో సీఎం కేసీఆర్ గారు ప్రకటిస్తారు
-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్..

తెలంగాణ లో ప్రస్తుతం కరెంట్ సమస్య లేదు..
భవిష్యత్తులో ఇక కరెంట్ పోదు అని కచ్చితంగా చెప్పగలను..
గతంలో అన్ని రంగాలకు కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేది..
సిరిసిల్లలో కూడా గతంలో కరెంట్ కావాలని ఏఈ ని అడిగే వాళ్ళం..
జలవిద్యుత్ కేంద్రం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం,7 ముంపు ప్రాంతాలను ఏపీ లో కలిపారు..
పవర్ హాలిడే వారానికి మూడు రోజులు ఉండేది..
ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసాం..
కానీ అవన్నీ అధిగమించి ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం
ఆ కష్టం అంత మీదే..
7వేల మెగావాట్ల నుండి.16 వేళా మెగావాట్ల ఉత్పత్తి కి ఎదిగాం..
సోలార్ విద్యుత్ లో రెండో స్థానంలో ఉన్నాం..
28 రాష్ట్రాల్లో ఎప్పుడు ముందున్న రాష్ట్రాల కంటే తలసరి విద్యుత్ లో తెలంగాణ ముందుంది..
పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ..
కొత్త విద్యుత్ కేంద్రాలు, కొత్త లైన్లు అన్ని తీసుకొచ్చిది తెలంగాణా మాత్రమే..
మోటార్లు,ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయేవి, కానీ ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం..
విద్యుత్ కార్మికుల సమస్యలు అన్ని పరిష్కరిస్తాం..
ఇది మీ , మా ప్రభుత్వం..
ప్రత్యేక చొరవ తీసుకుంటాం..
మౌలిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతున్నాయి..
అందులో మీ కృషి కూడా ఉంది..
వాయు వేగంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసాం..సాగు తాగు నీరు ఇస్తున్నాం..
ధాన్యబాండగారం తెలంగాణ నిలిచింది..
ఈ ఆరున్నర ఏళ్లలో అన్ని పూర్తి చేశారు కేసీఆర్.
945 గురుకుల పాఠశాలలు,
విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఆర్థికంగా చేయూత .
50 వేల ఉద్యోగాలు కూడా ప్రకటించారు అవి కూడా భర్తీ చేస్తాం..
ప్రతి రంగాన్ని ఎక్కడ లోటు లేకుండా న్యాయం చేశారు సీఎం కేసీఆర్..
నిన్న ఇవాళ కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..

ఒకరు టీపీసీసీ, ఒకరు టీ బీజేపీ

వారికి పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష
తెలంగాణ తీసుకొచ్చింది సీఎం కేసీఆర్
పెరిగిన ఆదాయం అన్ని రంగాలకు చేయూతకే
ఇలాంటి ప్రభుత్వం పై అవాకులు చెవాకులు పేలిన, ఇష్టానుసారంగా మాట్లాడిన వారిని మీరు తప్పక తిప్పికొట్టాలి…
రాష్ట్ర సాధనకు మీరు ఏ విధంగా ఉద్యమం చేశారో అలాగే వీటిని కూడా తిప్పికొట్టాలి..