భగవంతుని కృపతో సమయం వచ్చినపుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు…బొంతు రామ్మోహన్

కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే అనేకమంది మంత్రులు,నేతలు, ఎమ్మెల్యేలు,ఎంపీలు కేటీఆర్ కు మద్దతు పలికారు.అనేక సందర్భాల్లో కేటీఆర్ ను తమ ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ఈలిస్ట్ లో మరోనేత కూడా చేరిపోయారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భగవంతుని కృపతో సమయం వచ్చినపుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. కేటీఆర్ కూడా అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని బలోపేతం చేస్తూనే, మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు…