20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లు చుసేము. మంత్రి కేటీఆర్ ..

R9TELUGUNEWS.com.
హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లు చవిచూసిందని, ఒక్క ఓటమికే కార్యకర్తలు కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. అయినా, హుజురాబాద్‌ ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌ పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్‌ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్కు కృతజ్ఞతలు తెలిపారు..