కరోన థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు మందులు అందుబాటులో ఉన్నాయి..మంత్రి కేటీఆర్..

*రాజన్న సిరిసిల్ల జిల్లా
R9TELUGUNEWS.COM.
సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయములో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్.
అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.*

*కేటీఆర్ మాట్లాడుతు..

జిల్లాలో కరోన థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు మందులు అందుబాటులో ఉన్నాయి.

కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించాము.

వాక్సినేషనులో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా ఐదవ స్థానములో ఉంది..జిల్లాలో నాలుగు వందల డెబ్బైతొమ్మిది వైద్య బృందాలు లక్షా యాబై వేల ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్నాయి… రాష్ట్రంలో జిల్లా హెల్త్ ప్రొఫైల్ స్కీంకు పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైంది. పిబ్రవరిలో మొదటి వారంలో పనులు ప్రారంభం..జిల్లాలోని పదమూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మొదటి విడత దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది..
జిల్లాలో మనఊరు మనబడిలో భాగముగా ఐదువందల పది పాటశాలలను మూడు సంవత్సరాలలో ఆధునీకరిస్తాం…

తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటినుండి కేంద్రం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్టులలో ఇక్కడి నేతన్నలకు అన్యాయమే జరుగుతోంది. తెలంగాణ నేతన్నలను కనీసం కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు..
వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం ఎనిమిది వందల్ తొంబై ఏడు కోట్ల తొంబ్బై రెండు లక్షలు మంజూరు చేయించాలని బండి సంజయ్ ను డిమాండ్ చేస్తున్నాం…పోచంపల్లి కేంద్రంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఒయా హైన్ద్లూమ్ టెక్నోలోజీను ఏర్పాటు చేసే బాద్యత బండి సంజయ్ దే… లూమ్ అప్ గ్రడేషన్ పథకానికి కేంద్రం సహాయం చేయాలి. టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను కేంద్రం ఏర్పాటు చేయాలి.
రాష్ట్రములో కొత్తగా పదకొండు చేనేత సమూహాలను బండి సంజయ్ మంజూరు చేయాలి.మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను యంపి బండి సంజయ్ మంజూరు చేయించాలి. ఇది మంజూరు చేయకపోతే రాష్ట్రములోని నేతన్నలను ఏకం చేసి పోరాటం చేస్తాం.