టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు..!!

మునుగోడు ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ తరఫున అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతీ ఒక్క నాయకునికి, కార్యకర్తకి, పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఐటీ,పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తమ ప్రాంతాల నుంచి వచ్చి మరీ మునుగోడులో స్థానికంగా ఉంటూ టీఆర్ఎస్ సుపరిపాలనను అక్కడి ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇంఛార్జీలకు, వారితో వచ్చిన కార్యకర్తలకి నాయకులకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకారం అందించిన సోషల్ మీడియా వారియర్లకు సైతం పార్టీ తరపున ధన్యవాదాలు తెలిజేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.