మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నా.. మంత్రి కేటీఆర్‌

*మహిళలు రాజకీయ ల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది: మంత్రి కేటీఆర్*

మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ టెక్‌పార్క్‌ను బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మన జీవితాలు చాలా చిన్నవని,తన పాత్ర తాను పోషించానని పేర్కొన్నారు.పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌ లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా మారుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ చాలా అందమైన నగరమని.. ఇక్కడ టాలెంట్‌కు కొరత లేదని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువేనని తెలిపారు….