ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంగ్లంలో మాట్లాడుతుంటే నా గుండె గర్వంతో ఉప్పొంగుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎడారులను తలపించేవని, ఇప్పుడు ఏ చెరువు చూసినా నిండుకుండలా ఉన్నాయన్నారు. నర్మాల డ్యామ్‌ను నింపాలని ఈ ప్రాంత ప్రజలు గంభీరావుపేట నుంచి హైదరాబాద్‌లోని సీఎంను కలిసేందుకు వెళ్లిన రోజులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
అప్పటి పాలకులు మొక్కుబడిగా శిలాఫలకం వేసి చేతులు దులుపుకునే వారని, ఇప్పుడు నర్మాల ప్రాజెక్టు 365 రోజులు నిండుకుండలా ఉంటుందన్నారు. కుడవెల్లి నుంచే కాకుండా ప్యాకేజీ-9 ద్వారా నర్మాల డ్యామ్‌ను నింపబోతున్నామన్నారు. స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని గ్రామీణ నియోజకవర్గాలను అభివృద్ధి చేశారన్నారు. రైతుల ఖాతాలో రూ.73వేల కోట్లు జమ చేశారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబీమా సకాలంలో ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నామన్నారు.తొమ్మిదేళ్లలో గంభీరావుపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. చెరువును అభివృద్ధి చేయడంతో పాటు కేజీ టు పీజీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.13.5 కోట్లతో లింగన్నపేట – గంభీరావుపేట మధ్య హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే వర్షాకాలంలోగా దీన్ని పూర్తి చేస్తామని, నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెనలను నిర్మిస్తామన్నారు. గతంలో మున్సిపాలిటీగా ఉన్న గంభీరావుపేటను తిరిగి మున్సిపాలిటీగా చేస్తామన్నారు.గంభీరావుపేట పాత జీపీ వద్ద రూ.3కోట్లతో అధునాతన మార్కెట్‌ను నిర్మిస్తామన్నారు. రూ.3కోట్లతో లక్ష్మీపూర్ రోడ్డును నిర్మించున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 640 గుడిసెలు ,432 రేకుల షెడ్లు, 907 శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారికి మొత్తం 1,967 మందికి ప్రథమ ప్రాధాన్యతగా గృహలక్ష్మి పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. బతికి ఉన్నన్నాళ్లు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామన్నారు.