సంక్షేమ పథకాల్లో అవినీతి తెలుసుకోవడానికి రిపోర్టర్ అవతారం ఎత్తిన మంత్రి కేటీఆర్..

సంక్షేమ పథకాల్లో అవినీతి తెలుసుకోవడానికి రిపోర్టర్ అవతారం ఎత్తిన మంత్రి కేటీఆర్..

బహిరంగ సభ సాక్షిగా లబ్ధిదారులపై ప్రశ్నల వర్షం..

ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలేదన్న లబ్ధిదారులు..

లింక్ అడ్రస్ క్లిక్ చెయ్యండి.. విడియో మొత్తం చూడండి.

https://youtu.be/eXv1S4Rkq_0?si=pVDAB_BOBWMJ2_Pq.

*సూర్యాపేట*
లబ్ధిదారులకు కేటీఆర్ వేసిన ప్రశ్నలు.. లబ్ధిదారుల జవాబులు

*కేటీఆర్* : నమస్తే అమ్మ మీ పేరు
*లబ్ధి దారు* : సంగీత
*కేటీఆర్*: డబుల్ బెడ్ రూమ్ వచ్చినందుకు పైసలు ఇచ్చినవా
*లబ్ధిదారు* : లేదు ఎవరికి ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వకుండానే ఇల్లు ఇచ్చారు.
*కేటీఆర్*: ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఎంతమంది పిల్లలు
*లబ్ధిదారు*: ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాము, అద్దెనెలకు 3000, ఈ వచ్చే జీతం డబ్బులు సగం అద్దెకి పోతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ రావడంఆనందంగా ఉంది.

*కేటీఆర్*: ఏం పేరు తల్లీ
*లబ్ధి దారు 2* : నా పేరు సఫియా బేగం సాబ్
*కేటీఆర్*: ఎక్కడుంటున్నావ్ నువ్వు, అద్దె ఇంట్లోనా
*లబ్ధిదారు2* : అద్దె ఇంట్లోనే ఉంటున్నాను సాబ్. నెలకు 2000 కిరాయి
*కేటీఆర్*: పెన్షన్ ఎంత వస్తుంది
*లబ్ధిదారు2* : 3000
*కేటీఆర్*: అద్దె 2000, పెన్షన్ 3000 మొత్తం 5000 మిగులుతాయి ఇక నుండి
*లబ్ధిదారు2* : అవును సార్
*కేటీఆర్*: వడ్డికి ఏమైనా ఇస్తావా నాకు (సభ లో నవ్వులు) ఆల్ ది బెస్ట్
అవును మీ కౌన్సిలర్ కు 20 వేలు ఇచ్చిన వంట కదా
*లబ్ధిదారు2* : లేదు సార్ ఎవరికీ ఈలేనని ఎవరు అడగలేదు,
*కేటీఆర్*: ఏం పేరు మీ కౌన్సిలర్ పేరు
*లబ్ధిదారు2* : భాష
*కేటీఆర్*: భాషా సాబ్ ఎక్కడున్నావ్ .మంచిగా పని చేస్తున్నావ్
(అంతలోని స్టేజి మీద వచ్చిన భాషను చూసి)
భాషను చూసి చెప్తున్నావా ఏంది?
*లబ్ధిదారు2* : నేను చూడలేదు సార్ భాషను. ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఎవరు అడగలేదు.

దళిత బంధు లంచం ఇచ్చారట కదమ్మా ఎంత ఇచ్చారు..(మంత్రి కేటీఆర్)
లబ్ధిదారురాలు.. సార్ అర్ధరూపాయి కూడా ఇవ్వలేదు రోడ్డు మీద పడి బతుకుతున్నాం మాకు ఉపాధి చూపించారు..

(కేటీఆర్).. అందరూ కమిషన్లు తీసుకున్నారు అంటున్నారు కదా..

లబ్ధిదారురాలు..(చెప్పుతో కొట్టండి సార్ అలా అన్నవారిని)
సూర్యాపేటలో ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా మాకు వచ్చాయి సార్.

మంత్రి కేటీఆర్.. వామ్మో వద్దులే అంత పెద్ద మాటలు.. ప్రభుత్వం మీకు లబ్ధి చేసింది అది మాకు చాలా సంతోషం..

ఇలా ఒక్కొక్కరిగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో ఎంపిక ప్రక్రియ గురించి కేటీఆర్ ఇంటర్వ్యూ చేయడం సభికులను ఆకట్టుకుంది. సూర్యాపేటలో మొత్తం 804 డబుల్ బెడ్ రూమ్ లకు గాను అర్హుల అందరి సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు…