ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీకి పోటీ చేద్దాం..సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్..

దమ్ము, ధైర్యం ఉంటే నీ సిట్టింగ్ ఎంపీ సీట్ మల్కాజ్‌గిరి లో పోటీ చెయ్..

కేటీఆర్ సవాల్ చేసిన వీడియో క్రింద లింకుని క్లిక్ చేయండి.
https://youtube.com/shorts/WkXzjQU-V6g?si=NIWQfVMWybRNLvnu_.

_సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్_

__సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్_
నేను సిరిసిల్ల ఎమ్మెల్యే లకు రాజీనామా చేస్తా_

_ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీకి పోటీ చేద్దాం.

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి తాను రాజీనామా చేస్తాను. సీఎం ప‌ద‌వికి రేవంత్ రాజీనామా చేయాలి. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో ఇద్ద‌రం పోటీ చేద్దాం. మీ సిట్టింగ్ సీటు మ‌ల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం.. సేఫ్ గేమ్ వ‌ద్దు.. డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు..గ‌తంలోనూ రేవంత్ స‌వాల్ చేసి పారిపోయారు. కొడంగ‌ల్, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌వాల్ చేసి రేవంత్ పారిపోయారు. స‌వాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాట‌కు విలువేముంది..? త‌న‌ది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంక గాంధీది ఏం కోటా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రేవంత్‌ది పేమెంట్ కోటా.. డ‌బ్బులిచ్చి ప‌ద‌వి తెచ్చుకున్నారు. పేమెంట్ కోటా కాబ‌ట్టే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి. బిల్డ‌ర్లు, వ్యాపారుల‌ను బెదిరించి ఢిల్లీకి రేవంత్ క‌ప్పం క‌ట్టాలి. రేవంత్ సెస్‌పై త్వ‌ర‌లో బిల్డ‌ర్లు, వ్యాపారులు రోడ్డెక్కుతారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

మా ప్ర‌భుత్వంలో కొన్ని త‌ప్పులు జ‌రిగి ఉండొచ్చు. ప్ర‌భుత్వంలో అన్నీ సీఎం, మంత్రుల‌కు తెలియాల‌ని లేదు. త‌ప్పులు జ‌రిగాయ‌నుకుంటే విచారించి చ‌ర్య‌లు తీసుకోండి. మార్చి 2 నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిత్వాల‌పై క‌స‌ర‌త్తు చేస్తాం. ఎంపీ అభ్య‌ర్థిత్వాల‌పై కేసీఆర్ స‌మావేశాలు నిర్వ‌హిస్తార‌ని కేటీఆర్ తెలిపారు..