కేటీఆర్‌ న్యాయం చెప్పాలంటూ, ప్రముఖ యాంకర్, నటి అనసూయ తన ఆవేదనను వ్యక్తం…

KTR న్యాయం చెప్పాలి:అనసూయ..
కేటీఆర్‌ న్యాయం చెప్పాలంటూ ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు అనసూయ తాజాగా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
పిల్లలకు టీకాలు లేనందున స్కూల్స్‌కు వెళ్ళే పిల్లల పరిస్థితేంటి?..అని ప్రశ్నించారు. ..పిల్లలు సూల్‌లో ఉన్నప్పుడు ఏం జరిగినా తమది బాధ్యత కాందంటూ స్కూల్ యాజమాన్యం సంతకం చేయించుకుందని, క్లాస్ రూమ్ లకు పంపాలంటూ బలవంతం చేస్తున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పాలనీ, దీనిపై మార్గనిర్దేశం చేయాలని అనసూయ వరుసగా ట్వీట్లు చేశారు. మరి దీనిపై కేటీఅర్ ఎలా స్పందిస్తారో చూడాలి.